ఎస్ ఎస్ సి బోర్డు ఎగ్జామ్స్‌ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్(సీబీఎస్‌ఈ) పదో తరగతి పరీక్షలను ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మార్చి 29వ తేదీ వరకు నిర్వహించారు. (సీబీఎస్‌ఈ) పదో తరగతి ఫలితాలు ఈ నెల మొదటివారంలో ఎప్పుడైనా విడుదల కానున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఫలితాలు నేడు విడుదల కానున్నట్లు వస్తున్న ఊహాగానాలను బోర్డు కొట్టేసింది. అటువంటి వార్తలు వాస్తవం కాదని పేర్కొంది. ఫలితాలను బోర్డు వెబ్‌సైట్ cbseresults.nic.in, cbse.nic.in లో పొందుపరచనున్నట్లు తెలిపారు. కావునా విద్యార్థులు ఎటువంటి ఆందోళనకు గురికాకుండా వెబ్‌సైట్‌కు లాగినై ఫలితాలు చూసుకోవచ్చని తెలిపారు.