telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

స్కాం చేసేయ్ … విదేశాలు పట్టిపో… పౌరసత్వం వదులుకో.. ఎన్ని ఐడియాలో..

pnb bank scam culprit cancelled his nationality

ఈజీ మనీ కోసం తాపత్రయపడేవారి కోసం సరికొత్త దారి బ్యాంకు స్కాం లు చూపిస్తున్నాయి. ఈ చోరీలకు పాల్పడినా కూడా చక్కగా ఎలా తప్పించుకోవాలో వారే ఐడియాలు ఇస్తున్నారు. తాజాగా, పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి, ప్రస్తుతం అంటిగ్వాలో తలదాచుకున్న మేహుల్ చౌక్సీ, తన భారత పౌరసత్వాన్ని వదిలేసుకున్నారు. తన పాస్ పోర్టును ఆంటిగ్వా ప్రభుత్వానికి సరెండర్ చేశారు. మేహుల్ చౌక్సీని ఎలాగైనా ఇండియాకు రప్పించాలని చేస్తున్న ప్రయత్నాలకు ఇది గట్టి విఘాతమే. దాదాపు ఏడాదిగా అంటిగ్వాలో ఉంటున్న ఆయన, గడచిన డిసెంబర్ 25న కోర్టు విచారణకు హాజరై, తాను ఇండియాకు వెళ్లలేనని, తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా 41 గంటల పాటు ప్రయాణించలేనని చెప్పిన సంగతి తెలిసిందే. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుపుకోవచ్చని ఆయన తెలిపాడు.

పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ. 13 వేల కోట్ల మేరకు మోసం చేసి విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోదీకి మేహుల్ స్వయంగా మేనమామే. గత సంవత్సరం జనవరి తొలివారంలో మేహుల్ దేశం విడిచి వెళ్లిపోయాడు. ఇండియాలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని, ఆపై పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మేహుల్ చౌక్సీ తదితరులను ఎలాగైనా వెనక్కు రప్పిస్తామని, వారిని చట్టం ముందు నిలుపుతామని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మేహుల్ పౌరసత్వాన్ని వదులుకోవడంతో ఆయన్ను ఇప్పట్లో ఇండియాకు రప్పించడం కష్టసాధ్యమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటువంటి వారిని యువత ఆదర్శంగా తీసుకున్నా లేదా చర్యలు తీసుకోలేకపోతున్న దేశప్రభుత్వంపై వారికి అసంతృప్తి కలిగినా .. వారి ఆలోచనలు ఎంతదూరం వెళతాయో.. ప్రభుత్వం ఆలోచించి.. వీటిపై త్వరితగతిన ఒక నిర్ణయం తీసుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

Related posts