telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఓటర్ల సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1950

After 11 Parishat Elections Telangana

తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఓటర్లు తమ సమాచారాన్ని ఎన్నికల కమిషన్ ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్ 1950కి ఫోన్‌చేసి తెలుసుకోవచ్చు. అలాగే 9223166166 నంబర్‌కు ఎస్సెమ్మెస్ కూడా చేయవచ్చునని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటరు తన ఎపిక్ కార్డు నంబర్ టైప్ చేసి ఎస్సెమ్మెస్ చేస్తే వెంటనే పోలింగ్‌స్టేషన్ సమాచారం తెలుస్తుంది. అలాగే ఈసీఐ రూపొందించిన నాఓట్ యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

రాష్ర్టంలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహిస్తారు. ఈవీఎంలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నది. నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి ఎక్కువమంది పోటీలో ఉన్నందున ఇక్కడ పోలింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు.

Related posts