telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

మొబాయిల్ రైతు బజార్లుగా సిటీ బస్సులు!

city bus

లాక్‌డౌన్‌ వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండ ఏపీ సర్కార్ మొబైల్‌ రైతు బజార్లని ప్రారంభించింది. వీలైనంత ఎక్కువమందికి కూరగాయలను అందించే ఉద్దేశంతో సిటీ బస్సులను సంచార రైతు బజార్లుగా మారుస్తున్నారు. ఇందుకోసం ఆర్టీసీ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్నారు. విజయవాడ నగరంలో నిన్న ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ సంచార రైతు బజార్లకు విశేష స్పందన లభించిందని మునిసిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు.

తొలి రోజు 8 క్వింటాళ్ల కూరగాయలు విక్రయించామని అధికారులు తెలిపారు. ఆర్టీసీ బస్సుల ద్వారా నగరంలోని 53 డివిజన్ల పరిధిలో కూరగాయలు విక్రయించాలని యోచిస్తున్నారు. బస్సుల ద్వారా ప్రజల వద్దకే కూరగాయలను తీసుకెళ్లడం ద్వారా ప్రజలు ఒకే చోట గుమికూడకుండా చేయవచ్చన్నది అధికారుల ఆలోచన. ఇందులో భాగంగా నిన్న ఐదు బస్సుల ద్వారా ప్రయోగాత్మకంగా వివిధ ప్రాంతాల్లో సంచార రైతు బజార్లను నిర్వహించారు.

Related posts