telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ప్యాకింగ్ ఫుడ్ తినడం వలన కూడా .. క్యాన్సర్ సమస్య..

packing food causes cancer said doctors

సాధారణ ఆహారంతో మనిషి శరీరం ఎంతో ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ, ప్రస్తుతం హడావుడి జీవితాలు గడుపుతున్న మనం సమయానికి దొరికిన ప్యాకింగ్ ఆహారం ఏదో ఒకటి తినేస్తున్నాం. అయితే ఈ ఆహారం ప్యాకింగ్ కు వాడే వాటిలో శరీరానికి హానిచేసే టాక్సిన్స్ ఉంటాయని, అవి అతి త్వరగా క్యాన్సర్ రావడానికి కారణం అవుతాయని తాజాగా పరిశోధనలు వెల్లడించాయి. అందుకే ప్యాకింగ్ ఫుడ్ దాదాపుగా మానేయాలని ఆరోగ్య నిపుణులు కూడా స్పష్టంగా చెపుతూనే ఉన్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్స్ భద్రపరిచే కవర్లు, ఇతరత్రా ప్లాస్టిక్ వస్తువుల్లోని రసాయనాల ద్వారా మనం తీసుకునే పదార్థాలు అనారోగ్యాలను కొని తెచ్చిపెడుతున్నాయని వారు తెలియజేశారు.

ఈ ఫుడ్స్ భద్రపరిచేందుకు ఉపయోగించే వ్రాపర్స్‌‌లో టాక్సిన్స్, కార్సినోజెనిక్ టెప్లన్ కెమికల్ ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులు తప్పవని స్పష్టం చేశారు. ఈ విషయం ఫాస్ట్ ఫుడ్స్ ప్యాక్ చేసే పేపర్లు, ప్లాస్టిక్ పదార్థాలను పరిశోధించడంతో వెలుగులోకి వచ్చిందని పరిశోధకులు అంటున్నారు. వ్రాపర్స్ తయారీ కోసం ఉపయోగించే రసాయనాల ద్వారా క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి అవుతున్నాయని చెప్తున్నారు.

జంక్ ఫుడ్స్‌తోనే కాదు.. జంక్ ఫుడ్స్‌ను భద్రపరిచే ప్యాకెట్లతోనూ ఆరోగ్యానికి కీడు జరుగుతుందని.. అందుకే వాటిని తీసుకోవడం చాలామటుకు తగ్గించడం మంచిదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. బ్రెడ్, డెసర్ట్స్, బర్గర్లు, పిజ్జాలను ప్యాక్ చేసే వ్రాపర్స్ ద్వారా వాటిని ఆహారంగా తీసుకునే మనపై తీవ్ర ప్రభావం చూపుతాయని.. ఇందుకు వాటి తయారీకి పీఎఫ్‌ఓఎస్, టాక్సిక్ సబ్‌స్టన్న్ అనే రసాయనాలు ఉపయోగించడమే కారణమని పరిశోధకులు చెప్తున్నారు.

ఈ రసాయనాలతో తయారైన కవర్లలో భద్రపరిచే ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటే.. మెదడు పనితీరు మందగిస్తుంది. కాలేయం, ఉదరం, ఊపిరితిత్తులు, గర్భాశయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధనలో తేలింది. ఇంకా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడం, థైరాయిడ్ వంటివి తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Related posts