telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సోషల్ మీడియాకు కూతురిని పరిచయం చేసిన గీతా మాధురి

Geetha-Madhuri

సింగర్ గీతా మాధురి అంటే తెలియని వారుండరు. గీతామాధురి తన మధురమైన గాత్రంతో అంతలా పేరు సంపాదించుకుంది. దశాబ్దకాలం నుంచి టాలీవుడ్ లోని చిన్న, పెద్ద సినిమాలను తన గాత్రాన్ని అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే మూడేళ్ళ క్రితం గీత, టాలీవుడ్ హీరో నందూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రియాలిటీ షో “బిగ్ బాస్” ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఈ షోలో ఫైనలిస్ట్ గా నిలిచింది గీత. దీంతో ఆమెకు మరింతగా పాపులారిటీ పెరిగింది. అయితే ఇటీవలే గీతా మాధురి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా గీతా మాధురి తన పాపను సోషల్ మీడియా ద్వారా ఈ ప్రపంచానికి తెలియజేసింది. అంతేకాదు తన పాప పేరును కూడా ప్రకటించింది. ఈ మేరకు గీతా మాధురి తన ఇన్స్టాగ్రామ్ లో “అందరికి నమస్కారం, నా పేరు దాక్షాయణి ప్రకృతి. మీ గీత,నందు-ల Blockbuster Baby ని నేనే!” అనే పోస్ట్ కు పాపతో పాటు నందు, తాను కలిసి ఉన్న ఫోటోను జత చేసింది. దీంతో పాప పేరు బాగుందని తెలుపుతూ నందు, గీతా మాధురిలకు కంగ్రాట్స్ చెబుతున్నారు నెటిజన్లు.

Related posts