telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

జేబులో ఫోన్ పెట్టుకుంటున్నారా… అయితే మీ పని మటాషే !

ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు పుట్టడం లేదని డాక్టర్లను కలుస్తున్నారు. పని ఒత్తిడి, బిజీ లైఫ్‌ కారణంగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా పట్టణాలలో ఉండే వాళ్లకు ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని ఓ సర్వేలో తేలింది. పురుషులకు పిల్లలు పుట్టక పోవడానికి మెయిన్‌ రీజన్‌ వేడి అని వైద్యులు అంటున్నారు. అయితే.. ఇటీవల పురుషుల్లో పిల్లలు పుట్టకపోవడానికి మరో కారణం బయటపడింది. ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఎక్కువగా వాడే పురుషులకు కూడా పిల్లలు పుట్టే అవకాశం తక్కువట. ల్యాప్‌ టాప్‌, మొబైల్‌ నుంచి వచ్చే రేడియేషన్‌, వేడి వల్ల వీర్యం నశిస్తుంది. అందుకనే పురుషులు మొబైల్స్‌ను జేబుల్లో పెట్టుకోవద్దని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఇక చాలా మంది ల్యాప్‌ టాప్‌లను ఒడిలో పెట్టుకుని పనిచేసుకునే పురుషులు.. ఏ డెస్క్‌ మీదైనా పెట్టుకుని పనిచేయాలని చెబుతున్నారు. ల్యాప్‌ టాప్‌లు ఎక్కువగా ఒడిలో పెట్టుకుని పని చేసే పురుషుల్లో వీర్యం నాశనం అయి.. శుక్రకణాల కదలిక తక్కువగా ఉండి.. పిల్లలు పుట్టే అవకాశం కోల్పోతారని.. కనుక పురుషులు ల్యాప్‌ టాప్‌, మొబైల్స్‌ వాడే విషయంలో తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Related posts