telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

బ్యాంకాక్‌ : … విలువిద్యలో దీపిక .. స్వర్ణం ..

deepika got gold in asian archery championship

భారత విలు విద్య క్రీడాకారిణులు దీపిక, అనికితలు ఆసియా ఛాంపియన్‌షిప్‌లో అద్భుతం సృష్టించారు. వ్యక్తిగత రికర్వు ఈవెంట్‌లో స్వర్ణం, రజతం పతకాలను దక్కించుకున్నారు. ఒకవైపు మాత్రమే సాగిన ఈ పోరులో దీపికా కుమారి 6-0 తేడాతో అనికిత భకత్‌పై విజయం సాధించిం బంగారు పతకాన్ని గెలుచుకుంది. రన్నరప్‌గా నిలిచిన అనికితకు రజతం దక్కింది.

ఈ ఛాంపియన్‌షిప్‌ సెమీస్‌కు చేరడంతోనే వీరివురూ ఒలంపిక్స్‌ వ్యక్తిగత రికర్వు ఈవెంట్‌కు అర్హత పొందారు. అంతేకాకుండా సెమీస్‌లో వియత్నంకు చెందిన గుయెత్‌ డు తి అన్‌ను దీపిక, భూటాన్‌కు చెందిన కర్మను అనికిత ఓడించారు.

Related posts