కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. మంత్రి గంగుల, ఎమ్మెల్యే రసమయితో నెలకొన్న వివాదం నేపథ్యంలో ఎక్సైజ్ కమిషనర్ గా ఆయనను ప్రభుత్వం బదిలీ చేసింది. బీజేపీ ఎంపీ బండి సంజయ్, సర్ఫరాజ్ ల మధ్య నడిచిన ఫోన్ సంభాషణ కొన్ని రోజుల క్రితం లీక్ కావడం కలకలం రేపింది.
తనకు వ్యతిరేకంగా, సంజయ్ కు అనుకూలంగా కలెక్టర్ వ్యవహరిస్తున్నారని అప్పట్లో గంగుల ఆరోపించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు, ఇదే విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సర్ఫరాజ్ వివరణ కూడా ఇచ్చారు. ఆడియో టేపును ఎడిట్ చేసి లీక్ చేశారని కలెక్టర్ వివరించారు. అప్పట్లోనే సర్ఫరాజ్ పై చర్యలు తీసుకుంటారనే వార్తలు వచ్చినా అలాంటి చర్యలను ప్రభుత్వం తీసుకోలేదు. తాజాగా ఆయనపై బదిలీ వేటు పడింది.
జగన్ కోసం కుట్రలకు..ఏపీలో కేసీఆర్ ప్లాన్: దేవినేని