telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఉపాధ్యాయుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే…

Achenaidu tdp

ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు జగన్‌ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయ బదిలీల్లో రాజకీయం సిగ్గుచేటని.. వెబ్ కౌన్సెలింగ్ పేరుతో బదిలీ వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. సీనియారిటీ కాదని అనుయాయుల కోసం నీచ ఎత్తుగడ అని… ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక ప్రభుత్వంగా జగన్ సర్కార్ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులు రోడ్డెక్కేలా చేశారని.. ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు నిలబెట్టి పరువు తీశారన్నారు. ఉపాధ్యాయులంతా వెబ్ కౌన్సెలింగ్ వద్దంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని.. వెబ్ కౌన్సెలింగ్ తో ఎవరికి ఎక్కడ బదిలీ అవుతుందో కూడా తెలియని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 50-60శాతం ప్రాంతాలను బ్లాక్ చేయడం ఎవరి కోసం.?అని… నిరసన తెలిపిన ఉపాధ్యాయులపై కేసులు, అరెస్టులు సిగ్గుచేటని ఫైర్‌ అయ్యారు. ఈ నెల 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తున్నామని.. 5 డీఆర్సీలు, 11వ పీఆర్సీ ఎప్పుడిస్తారో, ఎంతిస్తారు.? అనిప్రశ్నించారు. మార్చి, ఏప్రిల్ నెలల సగం జీతం ఇంత వరకు ఇవ్వలేదని.. ఐఆర్ విషయంలో దగా, బదిలీలపై వేధింపులు దారుణమన్నారు. ఏకపక్షంగా స్కూల్స్ తెరిచి ప్రాణాలు తీశారని.. కరోనాతో ఉపాధ్యాయుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని పేర్కొన్నారు.

Related posts