telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

శాంసంగ్‌ … గెలాక్సీ నోట్‌ 10, ఎస్‌ 10 కొనుగోలుపై .. ప్రత్యేక ఆఫర్లు …

samsung offers on galaxy note and s 10

శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 10, ఎస్‌ 10 కొనుగోలుపై సంస్థ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. పండుగ సందర్భంగా ప్రవేశపెడుతున్న ఈ ఆఫర్లు ఈ నెలాఖరు వరకూ మాత్రమే వర్తిస్తాయని శాంసంగ్‌ స్పష్టం చేసింది. గెలాక్సీ నోట్‌ 10 సిరీస్‌ ఫోన్‌ కొనుగోలు చేస్తే రూ.12 వేల వరకూ, ఎస్‌ 10పై రూ.14 వేల వరకూ వినియోగదారులు లబ్ధి పొందవచ్చని వివరించింది. ఈ రెండు మోడళ్ల స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు ద్వారా రూ.9,990 విలువైన శాంసంగ్‌ గెలాక్సీ బడ్స్‌ రూ.3 వేల రాయితీతో రూ.6,990కే లభించనున్నాయి.

గెలాక్సీ వాచ్‌ యాక్టివ్‌ ధర రూ.19,990 కాగా దీనిపై రూ.6 వేలు తగ్గింపు వర్తించనుంది. అంతేకాక ఎస్‌ 10 ఫోన్లను ఎస్‌బీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్‌తోపాటు, రూ.5 వేల వరకూ ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. గెలాక్సీ నోట్‌ 10 కొనుగోలుపై రూ.6 వేల వరకూ ఎక్స్‌ఛేంజ్‌ సౌకర్యం ఉండగా, ఎస్‌బీఐ కార్డు ద్వారా చెల్లిస్తే మరో రూ.6 వేలు క్యాష్‌బ్యాక్‌ రానున్నట్లు శాంసంగ్‌ ప్రకటించింది.

Related posts