ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూఅసెంబ్లీలో ప్రభుత్వం ప్రొసీజరే ఫాలో కావడంలేదని, మండలిలోఫాలో అయితే జగన్ ప్రశ్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రూల్ 154 ప్రకారం మండలి చైర్మన్ నిర్ణయం తీసుకుని సెలక్ట్ కమిటీకి పంపారన్నారు. చైర్మన్ విచక్షణాధికారంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
నిన్న మండలిలో 22మంది మంత్రులు, వైసీపీ సభ్యులు తిష్టవేశారని, సభలో కార్యకలాపాలు ప్రభావితం చేయాలనుకున్నారన్నారు. వాళ్లందరినీ బయటకు పంపాలని రూల్ ప్రకారం తాను కోరానని యనమల చెప్పారు. మండలి, అసెంబ్లీ రెండు వేర్వేరు వ్యవస్థలని, వాటి అధికారాలు, బాధ్యతలు వేర్వేరుగా ఉంటాయన్నారు. మండలి ముందుకువచ్చిన బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపొచ్చునని, నిర్ణయం తీసుకునే అధికారం మండలికి ఉంటుందన్నారు.