telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా టెస్టుల విషయంలో అనుమానాస్పద వైఖరి: ఉత్తమ్‌

uttam congress mp

కరోనా టెస్టుల విషయంలో అనుమానాస్పద వైఖరి అవలంభిస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో కరోనా కేసులను తగ్గించడానికే తక్కువ పరీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ ఏపీ లో 80 వేల టెస్టులు జరిగితే, ఇక్కడ 19 వేల టెస్టులు మాత్రమే జరిగాయన్నారు. కరోనాతో చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల ఎక్సగ్రెసియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న ప్రతీ కుటుంబానికి రూ.5వేలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. 40కేజీ బస్తాకు 2 కేజీల కంటే ఎక్కువ తరుగుతీయవద్దన్నారు. పసుపు, బత్తాయి, నిమ్మ, మామిడి విషయంలో మార్కెట్ ఇంట్రవెన్షన్ చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

Related posts