కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నిర్మించిన చిత్రం “మీకు మాత్రమే చెప్తా”. ‘ఎవ్రీ ఫోన్ హ్యాజ్ ఇట్స్ సీక్రెట్స్’ అనేది ట్యాగ్ లైన్. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ మూవీలో అనసూయ భరద్వాజ్, వాణి భోజన్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. షమీర్ సుల్తాన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు మొదలైపోయాయి. మరోవైపు, హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో గురువారం రాత్రి సెలబ్రిటీ ప్రీమియర్ షో కూడా వేశారు. సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా ఫుల్ కామెడీగా ఉందని అంటున్నారు. సినిమా ప్రారంభం నుంచి ఆఖరి వరకు ఫన్ రైడ్ అని కొంత మంది ట్వీట్లు చేశారు. చూడదగిన సినిమా అని చెబుతున్నారు. కొన్ని సన్నివేశాల్లో అయితే నవ్వలేక పొట్టచెక్కలైపోతుందని అంటున్నారు. ఇక సెలబ్రిటీ షో చూసినవాళ్లలో కూడా చాలా మంది సినిమా గురించి పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. తరుణ్ భాస్కర్ అద్భుతంగా చేశారని, అభినవ్ గోమఠం కామెడీ టైమింగ్ సూపర్ అని చెబుతున్నారు. మొత్తం మీద హీరోగా సూపర్ సక్సెస్ అయిన విజయ్ దేవరకొండ నిర్మాతగానూ సక్సెస్ అయినట్టే అంటున్నారు.
previous post
next post