telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కార్మికలోకానికి పండగ రోజు మేడే!

కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పొరాడి సాధించిన రోజు ఈ మేడే. పెట్టుబడిదారీ వ్యవస్థను, శ్రమదోపిడిని కార్మికవర్గం నిలదీసిన రోజు మేడే. ఈ రోజు వారి ఐక్యత, పోరాటానికి నిదర్శనం.

18 గంటలు పాణించేసే కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం గురించి డిమాండ్ చేస్తూ 1886 మే1న చాలామంది కార్మికులు పోరాటం చేపట్టారు. దానికి మద్దతుగా నాలుగు రోజుల తరవాత షికాగోలోని హే మార్కెట్‌లో చాలా మంది ప్రదర్శన నిర్వహించారు. కానీ ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు. ఆ ఘటన కార్మికులకు కనువిప్పు కల్గించింది. 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలు చేపట్టారు.

coal mines1890, మే 1న బ్రిటన్‌లోని హైడ్ పార్క్‌లో చేపట్టిన ప్రదర్శనకు దాదాపు మూడు లక్షల మంది కార్మికులు హాజరయ్యారు. శ్రమ దోపిడీని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. పనిముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడారు. 24 గంటల్లో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి, మరో ఎనిమిది గంటలు రీక్రియేషన్‌ అన్నవి ఈ పోరాటం ద్వారా కార్మికులు సాధించుకున్నారు. ఆవిధింగా మే 1ని ప్రపంచ కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కూడా కుదిరింది.

1920లో ట్రేడ్‌ యూనియన్‌ ఏర్పాటుతో కార్మికవర్గంలో చైతన్యం పెరుగుతూ వచ్చింది. 1923లో తొలిసారి ఇండియాలో ‘మే డే’ను జరుపుకున్నారు .రెండో ప్రపంచ యుద్ధం తరవాత ఐరోపా దేశాల్లో ఈ రోజున సెలవు దినంగా పాటిస్తున్నారు. మన దేశంలోనూ సెలవు దినంగా పాటిస్తున్నారు. ప్రతి యేటా మేడే రోజు ట్రేడ్ యూనియన్లు, ఆయా రంగాల కార్మికులు ఎంతో ఘనంగా జరుపుకునేవారు. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కార్మికులు నిరాడంబరంగా నేడు “మేడే ” ను జరుపుకుంటున్నారు.

Related posts