పేద పిల్లలు చదుకునేందుకు “అమ్మ ఒడి” ఉద్దేశమని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అన్నారు. ఏలూరు జిల్లా పరిషత్‌లో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్‌లో విద్య రంగానికి ఎక్కువ నిధులు కేటాయించారని తెలిపారు.
ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాల కోసం రెండు దశల్లో పూర్తి స్థాయిలో అభివృద్థి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. తమకు చదువు నేర్పిన ఉపాద్యాయుల వల్లే ఈ స్థాయికి వచ్చామని, ఇప్పడు అదే గురువులను సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అన్ని రంగాల్లో ఉన్న ఉద్యోగుల సమస్యలతో పాటు ఉపాద్యాయుల సమస్యలను సైతం పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర రేవు ముత్యాలరాజు, డీఈఓ రేణుక పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాలకు వీడనున్న ‘చంద్ర’ గ్రహణం: బీజేపీ నేత లక్ష్మణ్