telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

పుష్ప విడుదల తేదీ వచ్చేసింది…

Pushpa

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్‌గా అల్లు అర్జున్‌ పాత్ర ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కొన్ని రోజుల క్రితం మారేడుపల్లి ఏజెన్సీ ప్రాంతంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంది. ఇక తదుపరి షెడ్యూల్ గా కేరళ వెళ్లనుందట పుష్ప బృందం. అయితే సినిమాపై బన్నీ ఫ్యాన్స్ తో పాటు దాదాపు తెలుగు ప్రేక్షకులందరికి కూడా భారీ అంచనాలున్నాయి. సుకుమార్ దర్శకత్వం కావడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. అయితే తాజాగా అభిమానులను పుష్ప టీమ్ సర్ ప్రైజ్ చేసింది. ఆగస్టు 13న పుష్ప సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ ట్విటర్ ద్వారా తెలిపారు. ‘ఈ ఏడాది మిమ్మల్నందరినీ థియేటర్లలో కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ తో కలిసి మరోసారి మేజిక్ చేస్తానని ఆశిస్తున్నా అంటూ’ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రిలీజ్ అయిన పోస్టర్ లో అల్లు అర్జున్ గెటప్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో బన్నీకి జోడిగా రష్మికా మందన్న నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక ఐటెం సాంగ్‌లో అల్లు అర్జున్‌తో స్టెప్పేసేందుకు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ను ఫైనల్ చేశారని తెలుస్తోంది.

Related posts