telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

చత్తీస్‌గఢ్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు విముక్తి

students college

కరోనా మహమ్మారి తో ప్రపంచ దేశాలు అల్లాడుతున్న నేపథ్యంలో ఆయా దేశాల నుంచి ఏపీకీ బయలుదేరిన తెలుగు విద్యార్థులు చత్తీస్‌గఢ్‌లో చిక్కుకున్నారు. ఏపీ ప్రభుత్వం చొరవతో రాష్ట్రానికి రావడానికి లైన్ క్లియర్ అయ్యింది. ఇటలీ నుంచి వచ్చిన 33 మంది తెలుగు విద్యార్థులు చత్తీస్‌గఢ్‌లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఏపీ సీఎం నీల సాహ్ని చొరవతో ఆ విద్యార్థుల సమస్య పరిష్కారం అయ్యింది.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థులకు విముక్తి లభించింది. ఏపీ డీజీపీ గౌతమ్‌సవాంగ్‌, ఐఏఎస్‌ కృష్ణబాబు రంగంలోకి దిగారు. రాయ్‌పూర్, జగదల్‌పూర్ మీదుగా రేపటికల్లా ఆ 33 మంది విద్యార్థులు విశాఖకు చేరుకోనున్నారు. వీరంతా క్షేమంగా ఏపీకి చేరుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

Related posts