telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కొత్తసినిమాకి … పాత సెంటిమెంట్

bunny

అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో హ్యాట్రిక్‌ చిత్రం తెరకెక్కబోతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో బన్నీ సరసన రష్మిక తొలిసారి జత కట్టబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ నెల 8న బన్నీ పుట్టినరోజు ఉండగా ఆ రోజున ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇక ఈ మూవీకి శేషాచలం అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు వార్తలు రాగా తాజా సమాచారం ప్రకారం బన్నీ కోసం పాత సెంటిమెంట్‌ను సుకుమార్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. బన్నీ-సుకుమార్ కాంబోలో ఇదివరకు వచ్చిన ‘ఆర్య’, ‘ఆర్య 2’ టైటిళ్లలో రెండు అక్షరాలు ఉండగా.. ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో ఈ మూవీ కోసం రెండక్షరాల టైటిల్‌ను పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

Related posts