“మంచు విష్ణు” హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న “కన్నప్ప” మూవీ టీజర్ ఈనెల 14న రిలీజ్ కానుంది.
కేన్స్ లో “కన్నప్ప” మూవీ టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది.
దీనిని ప్రేక్షకులులతో పంచుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు మంచు విష్ణు తెలిపారు.
ఈ మూవీ తన హృదయం లో ఎంతో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని వెల్లడించారు.
ఈ సినిమా లో ప్రభాస్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు.
“కన్నప్ప” పౌరాణిక కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది.
ఈ మూవీకి “పరుచూరి గోపాల కృష్ణ” డెవలప్ చేసిన కథ ఆధారంగా స్క్రీన్ ప్లే కూడా రాసుకున్నాడు.
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై విష్ణు తండ్రి “మంచు మోహన్” బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.