telugu navyamedia
సినిమా వార్తలు

బ్యాంకాక్ లో ఇద్దరు హీరోయిన్లతో బాలయ్య రొమాన్స్…!

june 10 balakrishna birthday

బాల‌కృష్ణ‌ హీరోగా కేఎస్ ర‌వికుమార్ దర్శకత్వంలో “రూల‌ర్” అనే సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకోగా, త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళేందుకు సిద్ద‌మైంది. గతంలో బాలకృష్ణ, కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన “జై సింహా” మంచి విజయాన్ని అందుకుంది. ఇక “రూలర్” చిత్రంలో సోనాల్ చౌహ‌న్‌, వేదిక క‌థానాయిక‌లుగా న‌టిస్తార‌ని తెలుస్తోంది. ఈ చిత్రంలో భూమిక చావ్లా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. ఇక న‌మిత లేడీ విల‌న్‌గా చిత్రంలో అల‌రించ‌నుంద‌ని చెబుతున్నారు. ఇక ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టినా… ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల 9న బ్యాంకాక్‌లో ప్రారంభం కానున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ నుంచి ఎలా గ్యాంగ్ స్టర్‌గా ఎలా మారాడనేదే ఈ సినిమా స్టోరీ. ఫుల్ ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియండెట్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యుయల్ రోల్లో యాక్ట్ చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో బాలకృష్ణ సరసన లెజెండ్ భామ సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటించనున్నారు. నమిత మరోముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమచారం. బ్యాంకాక్‌లో ముందుగా బాలయ్య, సోనాల్ చౌహాన్, వేదికలపై రెండు పాటలను చిత్రీకరించడంతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణను ఢీ కొట్టే విలన్ పాత్రలో జగపతి బాబు యాక్ట్ చేస్తున్నాడు.అంతేకాదు ఈ సినిమాలో జగపతి బాబు కూడా తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభియం చేయనున్నట్టు సమాచారం.ఈ సినిమాను ఐతే.. సంక్రాంతికి లేకుంటే సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

Related posts