telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“కోట్లు సంపాదించడం ఎలా?” అంటూ నాగబాబు వీడియో

Nagababu

మెగా బ్రదర్ నాగబాబు ‘కోట్లు సంపాదించడం ఎలా?’ అంటూ తన యూట్యూబ్ ఛానల్‌లో ఆసక్తికరమైన వీడియో ప్రోమోను విడుదల చేశారు. “మనిషికి బంధాలు అనుబంధాలు ముఖ్యం.. ప్రేమానురాగాలు ముఖ్యం.. ప్రతిదీ డబ్బుతో కొనలేం.. ఇలాంటి సోది మాటలు మనం చాలాసార్లు వింటాం. అన్ని పనులకంటే కూడా డబ్బు సంపాదించడం అనేది గ్రేటెస్ట్ పని. ఓ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్… అతన్ని కోరుకోని హీరో లేడు. అతను అప్పుల మీద అప్పులు చేస్తుంటాడు.. నిజంగా అతని పొజీషన్‌లో నేను ఉండి ఉంటే ఈపాటికి ఓ రెండు వేల కోట్లు సంపాదించేవాడిని. కాని అతను అప్పులు చేసేవాడు. ఒక టైంలో నాకు ఎంత అప్పు ఉందో చూసుకోవడానికి భయం వేసేది. మనోడు అనేవాడు ఒకడు ఉన్నాడు వాడు మేనేజ్ చేస్తాడులే అనుకుంటూ వాయిదా వేస్తూ వచ్చాను. దాని వల్ల నేను ఎంత దెబ్బ తిన్నానో నాకు తెలుసు. ఒక్కపైసా కూడా సంపాదించకుండా ఇంట్లో ప్రేమాభిమానాలు అంటూ కూర్చోగలమా? నీ భార్య నీకు గౌరవం ఇస్తుందా? నీ పిల్లలు తల్లిదండ్రులు కూడా గౌరవించరు. బాధ్యతల్ని నెరవేర్చనోడకి ప్రేమాభిమానాలు దొరకవు. డబ్బుని శ్రీ మహాలక్ష్మి, ధనలక్ష్మి అంటారు.. డబ్బుని గౌరవిస్తారు.. ప్రతి ఒక్కరికి డబ్బుని చూస్తే గౌరవం కలగాలి. డబ్బు చెడ్డది అనుకునే వాళ్లకి అర్థం కావాల్సింది ఏంటంటే.. మనీ ఎప్పుడూ గొప్పదే. ప్రతి మనిషి కూడా అనుకుంటే డబ్బు సంపాదించగలడు. ఆఖరుకి కాళ్లు చేతులు లేని వాళ్లు కూడా డబ్బు సంపాదించవచ్చు.. అది ఎలా.. అంటే?’ అంటూ ప్రోమో విడుదల చేశారు నాగబాబు.

Related posts