telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

మెంటల్ కాలిక్యులేషన్ ఛాంపియన్‌ భానుప్ర‌కాశ్‌ను అభినందించిన కేటీఆర్

ktr neelakanta

ఇటీవల లండన్‌లో జరిగిన వరల్డ్ మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్‌లో మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన నీలకంఠ భాను ప్ర‌కాశ్‌ ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. భాను ప్రకాశ్ ప్రపంచంలోనే వేగంతమైన మానవ కాలిక్యులేటర్‌గా నిలిచారు. ‘మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌’లో బంగారు పతకం సాధించి, రికార్డు సృష్టించారు.

భాను ప్రకాశ్‌ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి గ‌ణితంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇత‌నికి చిన్న‌ప్ప‌ట్నుంచే మ్యాథ్స్ అంటే ఇష్టం. దీంతో నాడే ఎస్ఐపీ వారి అబాకస్ ప్రోగ్రామ్‌లో ఎన్‌రోల్ చేసుకుని గణితంలో తన నైపుణ్యాలను పెంచుకునే దిశగా పయనించాడు. 2013లో అంతర్జాతీయ అబాకస్ చాంపియన్‌షిప్, 2011, 2012ల్లో జాతీయ అబాకస్ చాంపియన్‌షిప్‌లలో విజేతగా నిలిచారు.

Related posts