telugu navyamedia
సినిమా వార్తలు

“కమ్మ రాజ్యంలో కడప రెడ్లు”పై అప్డేట్ ఇచ్చిన వర్మ

Ram-Gopal-Varma

వివాదాస్పద చిత్రాలు, కామెంట్స్ తో వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “కమ్మరాజ్యంలో కడప రెడ్లు” అనే సినిమా తీయబోతున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు టైటిల్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తే… మిగతా సామాజికవర్గాల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దీంతో వర్మ “ఎండలకి భయపడి కాదు.. రెడ్లకు భయపడి కమ్మోళ్ళు బయటకి రావట్లేదంట” అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. రామ్ గోపాల్ వర్మ తాజాగా ఈ చిత్రం గురించిన లేటెస్ట్ అప్ డేట్ ను అభిమానులకు అందించాడు. “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” చిత్రం నుంచి తొలి సాంగ్ ట్రయిలర్ రేపు ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్టు ట్విట్టర్ లో ప్రకటించాడు. ఈ చిత్రాన్ని మోస్ట్ నాన్ కాంట్రవర్శియల్ చిత్రంగా వర్మ పేర్కొనడం గమనార్హం. కాగా ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్న వర్మ, దీనికి సంబంధించిన వివరాలను బయటకు రానీయకుండా జాగ్రత్త పడుతుండటం గమనార్హం. ఇక వర్మ చివరగా “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ఎన్నో వివాదాలను ఎదుర్కొని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” చిత్రంతో వర్మ ఎలాంటి సంచనాలు సృష్టించనున్నాడో చూడాలి.

Related posts