telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ భూమిపై అందమైన అనుబంధం పెళ్లి ఒక్కటే : అనుష్క

Anushka

టాలీవుడ్ చందమామ, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఇల్లాలిగా మారిన విషయం తెలిసిందే. అక్టోబర్ 30న తన ప్రియుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. పలువురు సినీ ప్రముఖులు ఈ నవ దంపతులకు స్పెషల్‌గా విషెస్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనుష్క స్పందిస్తూ ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పింది. ”ఈ భూమిపై అందమైన అనుభవమైనా, అనుబంధమైనా ఉందంటే అది పెళ్లి ఒక్కటే.. మనసులు రెండు కానీ ఒకటే ఆలోచన, హృదయాలు రెండు కానీ ఒకటే స్పందన” అని ట్వీట్ చేసింది అనుష్క. ముంబైలోని స్టార్ హోటల్ తాజ్ మహల్ ప్యాలెస్‌లో కాజల్- గౌతమ్ వివాహ వేడుక జరిగింది. పంజాబీ, కశ్మిరీ సంప్రదాయల్లో ఈ వేడుక నిర్వహించారు. కరోనా పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ వేడుక జరిపారు. కేవలం ఇరు కుటుంబాల సన్నిహితులు, దగ్గరి బంధువులు మాత్రమే కాజల్ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. హోమ్ డెకార్, ఇంటీరియర్ డిజైన్ కంపెనీని నడిపిస్తూ ప్రముఖ వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు కాజల్ భర్త గౌతమ్ కిచ్లు. ప్రస్తుతం కాజల్ పెళ్ళి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సౌత్ ఇండియన్ సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ.. పెళ్ళి తరువాత కూడా సినిమాలు చేయనున్నారన్న విషయం తెలిసిందే.

Related posts