telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పురుషులు కోరికలను అదుపులో పెట్టుకోకపోవడం వల్లనే… సీనియర్ నటుడికి చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్

Chinmayi

సీనియర్ నటుడు, శక్తిమాన్ ఫేమ్ ముఖేష్ ఖన్నా మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాలకు వ్యతిరేకంగా మాట్లాడి సంచలనం సృష్టించారు. మీటూ అనేది ఎప్పుడైతే ఆడవాళ్లు బయటకొచ్చారో అప్పటినుంచే ఎక్కువైందని పేర్కొంటూ సంచలన కామెంట్స్ చేశారు ముఖేష్ ఖన్నా. ఆడవాళ్లు ఇలా బయటకు రాకుండా, భుజం భుజం రాసుకు తిరగకుండా ఇంటి పని చూసుకుంటే మేలని ఆయన అన్నారు. ఇంటిని చక్కదిద్దుకోవడం మాత్రమే వాళ్ళపని అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ముఖేష్ ఖన్నా చేసిన ఈ వ్యాఖ్యలపై చిన్మయి ఫైర్ అయింది. కొందరి మానసిక పరిస్థితి చూస్తుంటే ఇబ్బందికరంగా అనిపిస్తోందంటూ ఘాటు రియాక్షన్ ఇచ్చింది. అయ్యా.. ముఖేష్ ఖన్నా అంటూ ఆయనపై విరుచుకుపడింది. ‘మహిళలు బయటకొచ్చి ఉద్యోగాలు చేయడం కారణంగానే మీటూ ఉద్యమం ప్రారంభమైందని చెప్పిన ఆయన.. పురుషులు తమ కోరికలను అదుపులో పెట్టుకోకపోవడం వల్లనే ఇలాంటివి కొనసాగుతున్నాయని ఎందుకు చెప్పలేకపోతున్నారు’ అంటూ సీరియస్ అయింది. మరోవైపు ముఖేష్ ఖన్నా తీరుపై సీనియర్ హీరోయిన్ రాధిక కూడా ఫైర్ అయ్యారు. ఈ మతిలేని, మూర్ఖత్వపు మాటలు వింటుంటే భయంకరంగా అనిపిస్తోందని, ఇలాంటి మాటలకు దూరంగా ఉండడమే మేలని తెలిపారు. ఈ ఇష్యూ జనాల్లో చర్చనీయాంశం కావడంతో మహిళా లోకం అంతా ముఖేష్ ఖన్నా వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు.

Related posts