telugu navyamedia
సినిమా వార్తలు

57 సంవత్సరాల “ఉమ్మడి కుటుంబం”

నందమూరి తారకరామారావు గారు నటించిన మరొక సూపర్ హిట్ సాంఘిక చిత్రం రామకృష్ణ ఎన్.ఏ.టి. కంబైన్స్ వారి “ఉమ్మడి కుటుంబం” 20-04-1967 విడుదలయ్యింది.

నిర్మాత నందమూరి తివిక్రమరావు గారు రామకృష్ణ ఎన్.ఏ.టి. కంబైన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకులు డి.యోగానంద్ దర్శకత్వం వహించారు.

ఈ చిత్రాన్నికి కధ, స్క్రీన్ ప్లే: ఎన్.టి.రామారావు, మాటలు: సముద్రాల జూనియర్, సంగీతం: టి.వి.రాజు, పాటలు: సి.నారాయణ Aరెడ్డి, కొసరాజు, ఫోటోగ్రఫీ: రవికాంత్ నగాయిచ్, నృత్యం: వెంపటి సత్యం, కళ: కృష్ణారావు, కూర్పు: జి.డి.జోషి అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి, సావిత్రి, నాగభూషణం, ముక్కామల, ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ, రేలంగి,సూర్యకాంతం,రాజబాబు వాణిశ్రీ,ఎల్.విజయలక్ష్మి, యస్.వరలక్ష్మి, ఛాయాదేవి, అల్లూరి రామలింగయ్య తదితరులు నటించారు.

ప్రఖ్యాత సంగీత దర్శకులు టి.వి రాజు గారి సంగీత సారధ్యంలో వెలువడిన పాటలు, పద్యాలు సూపర్ హిట్ అయ్యాయి.
“కాలు మోపిన చాలు”
“పోవు చున్నావా.. ఓ యమధర్మరాజా! ”
(సతీ సావిత్రి నాటకం)
“తస్సాదియా తమాశైనా బండి”
“ఓ భలే మోజుగా తయారైన ఓ పల్లెటూరి అబ్బాయి”
“దేవత ఏ దిగి వచ్చి మనషులలో కలిసిన కధ చెప్పాలని ఉంది.”
“చేతికి చిక్కావే పిట్టా నువ్వు”
వంటి హుషారైన పాటలు ప్రేక్షకులను అలరించాయి.

ఉమ్మడి కుటుంబాల జీవనవిధానాన్ని ప్రతిబంబించే విధంగా నిర్మించిన ఈ చిత్రం మన పూర్వీకుల ఉమ్మడి కుటుంబాలకు ప్రతీతగా నిలిచింది.

ఈ సినిమా లోని “సతీ సావిత్రి” నాటకంలో ఎన్టీఆర్ గారు తొలిసారిగా యమధర్మ రాజు పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించి విడుదలైన అన్ని కేంద్రాల్లో 50 రోజులు, 15 కేంద్రాలలో డైరెక్ట్ గా 100 రోజులు దిగ్విజయంగా ప్రదర్శింపబడి, రజతోత్సవం (సిల్వర్ జూబ్లీ) కూడా జరుపుకున్నది.

విజయవాడ – దుర్గాకళామందిరం థియేటర్లో ఏక ధాటిగా 197 రోజులు ప్రదర్శింపబడింది.

100 రోజులు ప్రదర్శింపబడిన కేంద్రాలు :-
1. విజయవాడ – దుర్గ కళామందిరం
2. గుంటూరు – నాజ్ డీలక్స్,
3. నెల్లూరు –శేష మహల్,
4. తెనాలి – వెంకటేశ్వర టాకీస్,
5. గుడివాడ – శరత్ టాకీస్,
6. మచిలీపట్నం – బృందావన్ టాకీస్,
7. ఏలూరు – వెంకట్రామా,
8. భీమవరం – సత్యనారాయణ టాకీస్,
9. రాజమండ్రి – అశోక మహల్,
10. విశాఖపట్నం – లక్ష్మీ,
11. కాకినాడ – కల్పన థియేటర్,
12. అమలాపురం – రమా పిక్చర్ ప్యాలస్,
13. తిరుపతి – జ్యోతి టాకీస్,
14. అనంతపూర్ – నీలం థియేటర్,
15. కర్నూల్ – చాంద్ టాకీస్
ధియేటర్లలో శతదినోత్సవాలు జరుపుకున్నది.

ఎన్టీఆర్ గారు నిర్మించిన కుటుంబ కథా చిత్రాలలో ఇది ఒక మణి పూసగా పేర్కొనవచ్చు. 1968లో మాస్కోలో జరిగిన అంతర్జాతీయ చలచచిత్రోత్సవాలకు “ఉమ్మడి కుటుంబం” సినిమా ఎంపిక చేయబడి ఆ ఉత్సవాలలో ఈ చిత్రం ప్రదర్శింపబడింది. మాస్కో చలచచిత్రోత్సవాలలో ప్రదర్శింపబడిన ఏకైక తెలుగు చలనచిత్రంగా “ఉమ్మడి కుటుంబం” చరిత్ర సృష్టించడం జరిగింది.

Related posts