telugu navyamedia
సినిమా వార్తలు

నటుడు విశాల్ కు గాయాలు

vishal

ఎన్టీఆర్ గతంలో నటించిన “టెంపర్”ను తమిళంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. విశాల్ హీరోగా “అయోగ్య” అనే టైటిల్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో విశాల్ సరసన రాశి ఖన్నా నటిస్తోంది. వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను విశాల్, జ్ఞానవేల్ రాజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలావరకు చిత్రీకరణను పూర్తి చేసుకుంది ఈ చిత్రం. అయితే ఈ చిత్రంలో అల్లు అర్జున నటించిన “సరైనోడు” చిత్రంలోని బ్లాక్ బస్టర్” పాటను వాడుకుంటున్నారు. ఈ పాటలో అల్లు అర్జున్ చేసిన స్టెప్స్ ప్రేక్షకులతో విజిల్స్ వేయించాలి. డ్యాన్స్ కు ప్రాధాన్యమున్న పాట కావడంతో విశాల్ కూడా కష్టమైన స్టెప్స్ వేయడానికి సిద్ధపడ్డాడట. కానీ ఈ పాట చిత్రీకరణలో ప్రమాదవశాత్తు గాయాలపాలయ్యాడట. విశాల్ కే మోచేయితోపాటు కాలికి కూడా గాయమైందట.దీంతో ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణను ఆపేశారట. విశాల్ కోలుకోగానే మళ్ళీ చిత్రీకరణను మొదలుపెడతారట.

Related posts