telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్‌బాస్‌ 5 న్యూ లిస్ట్‌ !

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 సెప్టెంబర్ నెలలో ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఉత్కంఠ మొద‌లైంది. ఈ షోలో పాల్గొనే వారి పేర్లు రోజుకో పేరు వినిపిస్తుంది. కొత్తగా ఈ లిస్ట్ లోకి జబర్దస్త్ లో అందంతో పాటూ, కామెడీతో అలరిస్తున్న “వర్ష” కూడా పాల్గొంటున్నట్టు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతుంది. ఇదే కానీ నిజమైతే జబర్దస్త్ కు మరో పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న అభిమానుల ఎదురుచూపులకు తెరపడనుంది.

Jabardasth Varsha to become Bigg Boss Varsha?

దాని కన్నా ముందు బిగ్‌బాస్‌ ఇంట్లోకి ఎవరు వెళ్లబోతున్నారనే దానిపైనే అందరికి ఆసక్తి నెలకొంది. వీళ్ళే ఫైన‌ల్ లిస్ట్ అంటూ చాలా వార్తలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. కొత్తగా మరో జబర్దస్త్ షో నటి బిగ్‌బాస్‌ లో కనపడనుందన్న ప్రచారం వినపడుతుంది.. అందంతోనే కాదు కామెడీతో ఆకుట్టుకుంటున్న “జబర్దస్త్ వర్ష” ఇపుడు ఆ షో ను వదిలి, బిగ్‌బాస్‌ 5లో చేరనుందన్న ముచ్చట్లు వినపడుతున్నాయి.

TV9 Anchor Pratyusha Age, Family, Photos, Biography & More

ఇది మాత్రం నిజమే అయితే జబర్దస్త్ కు భారీ నష్టమనే చెప్పాలి. ఇప్పటి వరకి బులెట్ బాస్కర్ మరియు ఇతరేతర టీంలలో చేస్తున్న వర్ష కామెడీ టైమింగ్‌ మంచి పేరు తెచ్చుకుంది. బిగ్‌బాస్ సీజన్ 5లో పాల్గొనే కంటెస్టెంట్ ల జాబితా ఇప్పటికే చాలాపేర్లు ముందుకొచ్చినా.. ఇప్పుడు తాజాగా మరో జాబితా వైరల్ అవుతోంది.

Anchor Ravi Images | Download Telugu Anchor Hd Photos, Stills, Gallery

తాజా కంటెస్టెంట్ల లిస్ట్ :-
నటి ప్రియ, కార్తీకదీపం ఉమాదేవి, 7ఆర్ట్స్ సరయు, నటుడు మానస్ షా, నటుడు సన్నీ, యాంకర్ రవి, ఆర్జే కాజల్, శ్వేతా వర్మ, లహరి షారి, కమెడియన్ లోబో, టీవీ 9 యాంకర్ ప్రత్యూష, ఆట సందీప్, రఘు, కొత్తగా “జబర్దస్త్ వర్ష” పేరు కూడా వినపడుతుంది. ఈ షోను అక్కినేని నాగార్జున హోస్ట్ చేయబోతున్నారు. బిగ్‌బాస్‌-5 తెలుగు కోసం అందరు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Related posts