ఐపీఎల్ సమయం దగ్గర పడుతున్న కొద్ది అన్ని ప్రాంఛైజీలు అభిమానులను ఆకట్టుకునే పైలో ఉన్నాయి. అయితే తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ అదిరే పోస్టర్ ను విడుదల చేసింది. గత కొన్ని రోజులు నుంచి వారి టీం మెంబర్స్ పై సూపర్బ్ ఎడిట్స్ మన స్టార్ హీరోస్ పై చేసి అదరగొడుతున్నారు. ఇప్పుడు వార్నర్ ను “బాహుబలి”గా ప్రాజెక్ట్ చేస్తూ మైండ్ బ్లోయింగ్ ఎడిట్ తో వచ్చారు. ప్రభాస్ ది ఇంటెన్స్ పోస్టర్ ను వార్నర్ గా ఎడిట్ చేసి వదలగా ఓ పక్క సన్ రైజర్స్ అభిమానులు మరోపక్క ప్రభాస్ అభిమానులు కూడా సూపర్బ్ రెస్పాన్స్ అందిస్తున్నారు. మొత్తానికి మాత్రం ఈ పోస్టర్ సూపర్బ్ గానే ఉందని చెప్పాలి. అయితే గత ఏడాది లాక్ డౌన్ సమయంలో ఆస్ట్రేలియన్ డాషింగ్ బ్యాట్సమెన్ డేవిడ్ వార్నర్ ఓ వీడియో చెయ్యగా భారీ రెస్పాన్స్ వచ్చింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్, స్టార్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ నిన్ననే జట్టుతో కలిసారు. అయితే ఏప్రిల్ 11న సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మొదటి మ్యాచ్ లో తలపడుతుంది.
previous post
next post
సీఎం తన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలి: కన్నా