telugu navyamedia
సినిమా వార్తలు

‘మ్యాస్ట్రో’ మూవీ ట్రైలర్‌

హీరో నితిన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘మ్యాస్ట్రో’. నభా నటేశ్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిచింది. స్టార్‌ హీరోయిన్‌ తమన్నా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్‌లో అంధుడిగా పాత్రలో నితిన్‌ నటన మెప్పిస్తోంది.

నభా నటేశ్‌, తమన్నా తమ అందంతో, అభినయంతో ఆకట్టుకుంటున్నారు. క్రైమ్‌ సన్నివేశాలు ఉత్కంఠగా సాగాయి. హిందీలో విజయవంతమైన ‘అంధాధున్‌’ రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. కాగా నితిన్‌కి ఇది హీరోగా 30వ చిత్రం.

Related posts