telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అంధురాలిగా నయన్ ?

Nayan

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం ‘నేత్రికాన్’ ‘మూకుతి అమ్మన్’ చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన ‘అన్నాత్తే’ సినిమాలోనూ కనిపించనుంది. వీటితో పాటు ‘కాతువాకుల రెండు కాదల్’ అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఈ చిత్రానికి నయన్ బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అంధురాలిగా కనిపించనుందట. గతంలో వచ్చిన “నేనే రౌడీ నే” అని సినిమాలో వినికిడి లోపం ఉన్న పాత్రలో నటించి అదరగొట్టింది. ఇక ఈ బ్యూటీ తెలుగు, తమిళ భాషాల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే మరోవైపు తనకు మాత్రమే సాధ్యమయ్యే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది.

Related posts