telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

‘రాధేశ్యామ్’ ఈ పోస్టర్ కూడా కాపీనా…?

ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ అనే పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌‌తో పాటు టైటిల్‌‌తో కూడిన పోస్టర్‌ను ఇటీవలే రిలీజ్ చేసారు చిత్రయూనిట్ . ఈపోస్టర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే  ఈ పోస్టర్ పై కాపీ అంటూ అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. వరుణ్ తేజ్ – ప్రజ్ఞా జైస్వాల్ ‘కంచె’ పోస్టర్, .. బెల్లకొండ శ్రీనివాస్ – పూజాహెగ్డే ‘సాక్ష్యం’. రణవీర్ సింగ్ – దీపికా పదుకొనే ‘రామ్ లీల’ సినిమా పోస్టర్లతో ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ ని పోల్చుతూ నెటిజన్స్ మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేశారు.దీని పై చిత్రయూనిట్ స్పందించలేదు.అక్టోబర్ 23న డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం నుంచి ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ పేరుతో మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నామని ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇప్పుడు ఈ పోస్టర్ కూడా కాపీనే అంటూ సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. ఇందుకు సంబందించిన  పోస్టర్ ను షేర్ చేస్తున్నారు నెటిజన్లు. బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ పోస్టర్ లో ఓ రైలు నుంచి దట్టమైన పొగవస్తున్నట్టు చూపించారు. ఇప్పుడు ఆ పోస్టర్ కు సంబంధించి ఒరిజినల్ పిక్ అంటూ సేమ్ ఫోటోను షేర్ చేస్తున్నారు నెటిజన్లు. రెండిటినీ పక్క పక్కన పెట్టి ‘రాధే శ్యామ్’ పోస్టర్ కాపీ అంటూ నెటిజన్స్ పోస్టులు చేస్తున్నారు.

Related posts