telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అదా శర్మ వెరైటీ మాస్క్… అవాక్ అవుతున్న నెటిజన్లు

Adah-Sharma

టాలీవుడ్ లో ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది అదాశర్మ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఫరవాలేదనిపించిన ఈ బ్యూటీకి మాత్రం పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, గరం, క్షణం, కల్కి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ విన్యాసాలతో ఫోటో షూట్‌లు చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఆమె యోగా, డ్యాన్స్ చేస్తున్న వీడియోలు అప్‌లోడ్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తూ ఉంటుంది. ప్రస్తుతం అదా వరుసగా సినిమాలకు కమిటవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ వింత మాస్క్ ధరించి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ కుర్రది. తాజాగా ఎయిర్ పోర్ట్ లో ఇలా కనిపించి షాక్ ఇచ్చింది. ఆమె వెరైటీ మాస్క్ లుక్ చూసి నెటిజన్లు అవాక్ అవుతున్నారు.

Related posts