మెగాస్టార్ 152 వ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. కొరటాల శివ ఈ సినిమా షూటింగ్ వేగంగా షూట్ చేస్తున్నారు. 100 రోజుల్లోపుగా సినిమా షూటింగ్ పూర్తి చేయాలన్నది ప్లాన్. అందుకే ఇంతలా ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటుగా చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చరణ్ పాత్ర 40 నిమిషాల వరకు ఉంటుందని అంటున్నారు. అయితే, చరణ్ పాత్ర గురించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఇందులో రామ్ చరణ్ స్టూడెంట్ యూనియన్ లీడర్ గా కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. స్టూడెంట్ యూనియన్ లీడర్ గా వారిలో చరణ్ చైతన్యం నింపే పాత్రను చేయబోతున్నారట. ఈ సినిమా కోసం చరణ్ 30 రోజుల కాల్షీట్ ఇచ్చారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా మే14న ప్రేక్షకుల ముందుకు రానుంది. చూడాలి మరి ఈ సినిమా అభిమానులను ఎంతగా ఆకట్టుకుంటుంది అనేది.
previous post
next post
మగాళ్లను ద్వేషించే జాబితాలో లేను : శృతి హాసన్