telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నపీఎం మోడీ

modi delhi

భారత ప్రధాని మోదీ నేడు మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవం జరగనుంది. గన కొన్నాళ్లుగా ఆగ్రాలో మెట్రోను తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దానికి నేడు పీఎం స్వీకారం చూట్టనున్నారు. ఆగ్రాలో మెట్రోను నిర్మించడం ద్వారా ప్రజల నిత్య జీవనం మరింత సులభంగా కొనసాగుతుందని అంటున్నారు. స్థానిక ప్రజలకే కాకుండా పర్యాటకులకు అన్ని ప్రదేశాలను వీక్షించడం మరింత సులభతరం అవుతుందని తెలిపారు. ఈ మెట్రో దాదాపు 29.4 కిలోమీటర్ల పొడవుగా నిర్మించనున్నారు. దీనిని రెండు కారిడార్లలో ప్లాన్ చేశారు. ఆగ్రాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను కలిపే విధంగా ఈ మెట్రోను డిజైన్ చేసినట్లు తెలిపారు. నేడు మధ్యహ్నం 12గంటల సమయంలో తాజ్ మహల్, ఆగ్రా కోట, సికింద్రా, రైల్వే స్టేషన్స్, బస్టాండ్స్‌ను కలుపుకుంటూ వెళ్లే ఈ మెట్రోను కట్టుబడులను ప్రారంభించనున్నారు. అయితే ఈ ప్రారంభోత్సవానికి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు అయ్యి ప్రారంభించనున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.8,379.62 కోట్లు ఖర్చును అంచనా వేశారు. ఈ ప్రాజెక్టును ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆరంభోత్సవానికి యోగి ఆధిత్యనాథ్, హర్డీప్ సింగ్ పూరి మరి కొందరు ప్రముఖులు హాజరుకానున్నారు.

Related posts