telugu navyamedia
సినిమా వార్తలు

జాన్వీ ఫిట్నెస్ కు ఫిదా అవుతున్న నెటిజన్లు

Jhanvi-Kapoor

దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్ మొదటి చిత్రం “ధడక్” తోనే విజయాన్ని అందుకొని తన సత్తా చాటింది. ఆ తరువాత హీరోయిన్ గా ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈమె “తక్త్”, “కార్గిల్ గర్ల్”, “రూహ్ అఫ్జా” చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ అమ్మడు సినిమా స్క్రిప్ట్స్ ఎంపికలో జాగ్రత్త వహించడమే కాదు ఫిట్‌నెస్ విషయంలోనూ జాగ్రత్తలు వహిస్తుంటారు. తెరపై అందంగా కనిపించడంకోసం జాన్వీ జిమ్ లో చాలాసేపు కష్టపడుతూ ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు పలు రకాల నృత్యాల్లోనూ శిక్షణ పొందుతోంది. జాన్వీ జిమ్ సెంటర్‌కి వెళ్లే ఫొటోలు నెట్టింట్లో సందడి చేస్తుంటాయి. కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో జాన్వీ కపూర్, ఆమె ఫిట్‌నెస్ ట్రెయిన్ నమ్రతా పురోహిత్ దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జాన్వీ ఫిట్‌నెస్‌కి అందరూ ఫిదా అవుతున్నారు. మరోవైపు జాన్వీని తెలుగు తెరకు కూడా పరిచయం చేయడానికి దర్శకనిర్మాతలు ఉవ్విళ్ళూరుతున్నారు. ఇప్పటికే కొంతమంది జాన్వీతో తెలుగు సినిమాల విషయమై సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

Related posts