telugu navyamedia
సినిమా వార్తలు

బాలీవుడ్ రీమేక్ పై కన్నేసిన నాని

Nani

ఇటీవల కాలంలో దక్షిణాది సినిమాలు బాలీవుడ్‌లో ఎక్కువగా రీమేక్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఓ బాలీవుడ్ సినిమా రీమేక్ విషయం దక్షిణాదిన చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన “అంధాధున్:” సినిమాను దక్షిణాది భాషల్లోకి రీమేక్ చేసేందుకు ప్రయ్నతాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన ఆయుష్మాన్ ఖురానాకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా వచ్చింది. తమిళంలో ప్రశాంత్ హీరోగా ఈ సినిమా రీమేక్ అవుతోంది. తెలుగులో కూడా ఈ సినిమా రీమేక్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేచురల్ స్టార్ నాని ఈ సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. నాని ప్రస్తుతం “గ్యాంగ్‌లీడర్” సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఇంద్రగంటి మోహన్‌క‌ృష్ణ తెరకెక్కించనున్న “వి” సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత “అంధాధున్” రీమేక్‌ను పట్టాలెక్కించే అవకాశమున్నట్టు సమాచారం. త్వరలోనే “గ్యాంగ్ లీడర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నాని.

Related posts