telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

హోటల్ లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది సజీవ దహనం!

fire building

యూరప్ దేశమైన ఉక్రెయిన్ లో ఈరోజు ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఒడెస్సా నగరంలో ఉన్న”టోక్యో స్టార్ హోటల్” లో ఈరోజు తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో హోటల్ అంతా మంటలు దట్టంగా వ్యాపించాయి. మంటల్లో చిక్కుకొని దీంతో 8 మంది సజీవదహనం కాగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ, అత్యవసర సేవల బృందం ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది దాదాపు 3 గంటల పాటు కష్టపడి ఈ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. టోక్యో స్టార్ హోటల్ లో ఇందులో 273 గదులు ఉన్నాయి. అయితే ప్రమాద సమయంలో ఈ హోటల్ లో ఎంతమంది ఉన్నారో తెలియరాలేదు.

Related posts