సమాజ్ వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ పై సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద విమర్శనాస్త్రాలు సంధించారు. రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో జయప్రద పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆజం ఖాన్ వల్ల ఎంతో మంది మహిళలు కన్నీరు పెట్టుకున్నారని అన్నారు.
మహిళల శాపాలు ఆయనకు తగిలాయని మండిపడ్డారు. మహిళల శాపాల వల్లనే ఆయన్ను భూ కబ్జా కేసులు చుట్టుకున్నాయని అన్నారు. ఆయనిప్పుడు ప్రచార సభల్లో రోదిస్తున్నాడని దుయ్యబట్టారు. తనను మంచి నటి అని చెప్పే ఆయన, ఇప్పుడు సభల్లో తనకన్నా అద్భుతంగా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు.
హత్యలకు బీహార్ కేంద్రంగా మారింది: గులాం నబీ అజాద్