telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : భారత ఆటగాళ్లదే ఆధిపత్యం

IPL

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 లో ఇప్పటిదాకా జరిగిన ఈ ఏడు మ్యాచుల్లోనూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు భారతీయ క్రికెటర్లకే దక్కాయి. ఆరుమంది భారతీయ ప్లేయర్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నారు. ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆ ఛాన్స్ విదేశీ ఆటగాడికి దక్కింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్న ఆరుమందిలో ముగ్గురు బౌలర్లు ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ ముగ్గురు బౌలర్లు తమ జట్టను విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పటిదాకా హర్షల్ పటేల్, శిఖర్ ధావన్, నితీష్ రాణా, సంజు శాంసన్, రాహుల్ చాహర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జయదేవ్ ఉనద్కత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. వారిలో మ్యాక్స్‌వెల్ ఒక్కడే విదేశీ క్రికెటర్. హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, జయదేవ్ ఉనద్కత్.. ముగ్గురూ బౌలర్లే. ఈ ఐపీఎల్ 14వ ఎడిషన్‌లో బౌలర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటిదాకా సాగిన ఏడింట్లో లో స్కోర్ మ్యాచ్‌లే అధికం.

Related posts