ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కు ఉండవల్లి గ్రామ వీఆర్వో వెళ్లారు. కృష్ణానది ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, తక్షణమే ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చేందుకు అక్కడకు వెళ్లారు. అయితే, అక్కడ ఎవరూ లేకపోవడంతో… ఇంటి గోడకు నోటీసును అతికించి వచ్చారు. వరద ముంచెత్తె అవకాశం ఉన్నందున ఇంటిని ఖాళీ చేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.
మరో వైపు కృష్ణానదికి లక్షలాది క్యూసెక్కుల వరదనీరు పోటెత్తుతుండటంతో విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ నీటమునిగాయి. దిగువన ఉన్న పలు గ్రామాలు జలాదిగ్బంధంలో ఉండడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.
నన్ను బీజేపీ, టీడీపీలు కరివేపాకులా వాడుకున్నాయి: పవన్