telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

రామ మందిర విరాళాల సేకరణపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు…

Vidyasagar mla Trs

ప్రజల నుంచి సేకరించిన విరాళాలతోనే అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని తలపెట్టారు.. అందులో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా విరాళాల సేకరణ కొనసాగుతోంది.. భక్తులు, దాతల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించే కార్యక్రమం చురుకుగా సాగుతోంది.. తెలంగాణలోనూ ఈ నెల 20వ తేదీ నుంచి ఈ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే, విరాళాల సేకరణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు.. అయోధ్య రామాలయానికి విరాళాలు ఇవ్వొద్దంటూ పిలుపునిచ్చారాయన.. ఉత్తరప్రదేశ్ రాముడు మనకెందుకు.. మన దగ్గర రాముడి ఆలయాలు లేవా? అంటూ ప్రశ్నించిన కోరుట్ల టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే.. కొత్త వివాదానికి తెరలేపారు. అంతేకాదు.. బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు విద్యాసాగర్‌రావు.. రాముని పేరు మీద భిక్షం ఎత్తుకుంటున్నారని, దీంతో.. కొత్త నాటాకనికి తెర లేపుతున్నారంటూ ఘాటుగా స్పందించారు. బొట్టు పెట్టుకుంటేనే రాముని భక్తులా..? అని ప్రశ్నించిన ఆయన.. తామంతా శ్రీరాముని భక్తులమేనని చెప్పుకొచ్చారు. ఇక, టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.. ఇప్పటికే పలు సందర్భాల్లో హిందువులపై టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా.. ఇప్పుడు విద్యాసాగర్‌రావు వ్యాఖలు హాట్‌టాపిక్‌గా మారాయి. చూడాలి మరి ఏ వ్యాఖ్యలపై బీజేపీ ఎలా స్పందిస్తుంది అనేది.

Related posts