telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

రాయిగా మారాను.. దొషులపై జాలి లేదు: నిర్భయ తల్లి

nirbhaya-mother police

నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఖరారు కావడంతో తన బిడ్డ బతికేందుకు సహకరించాలని ఓ దోషి తల్లి కన్నీటితో నిర్భయ తల్లికి విజ్ఞప్తి చేసింది. విజ్ఞప్తిపై నిర్భయ తల్లి ఘాటుగా స్పందించారు. తాజాగా ఓ టీవీ చానెల్ తో మాట్లాడిన ఆమె, కేసులో దోషిగా ఉన్న ముఖేశ్ సింగ్ తల్లి చేసిన అభ్యర్థనపై స్పందిస్తూ నేను ఎన్నో ఏళ్లుగా ఏడుస్తూనే ఉన్నాను. నా కళ్ల వెంట రక్తపు కన్నీరే కారింది. నా గుండె ఇప్పుడు రాయిగా మారింది” అని వ్యాఖ్యానించారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని తాను ఎలా మరచిపోగలనని ప్రశ్నించారు.

తన కుమార్తె శరీరాన్ని రక్తంలో ముంచేశారని, ఆమె శరీరంపై ఎన్ని గాయాలు ఉన్నాయో అందరికీ తెలుసునని అన్నారు. జంతువుల్లా ఆమెపై దాడి చేశారని, ఇప్పుడు వీరి ఏడుపులు, శిక్షను తప్పించుకునేందుకు చేస్తున్న విజ్ఞప్తులు తనను మార్చలేవని అన్నారు. వారిపై ఇప్పుడు తనకు ఎటువంటి దయ, జాలి లేవని అన్నారు. తన కుమార్తెను తాను అత్యంత దయనీయ స్థితిలో చూశానని, అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏడుస్తూనే ఉన్నానని అన్నారు.

Related posts