telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

రోహిత్ శర్మ కు .. ఎంపీ గౌతమ్ గంభీర్ ప్రశంసలు..

gambhir comments on rohit sharma

బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెస్టుల్లో ఓపెనర్‌గా ప్రమోషన్ తెచ్చుకొని తొలి టెస్టులోనే రెండు సెంచరీలతో వీరవిహారం చేసిన నేపథ్యంలో.. రోహిత్ ఓపెనర్‌గా రావాలని నిర్ణయించుకోవడం మంచి నిర్ణయమని గంభీర్ అన్నారు. అవి టెస్టులా, వన్డేలా.. అన్నది కాకుండా రోహిత్ తన సహజ ఆటతీరును కొనసాగించాలని చెప్పారు. ఈ సందర్భంగా తాను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నానని, ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రమాదకర ఆటగాడు రోహిత్ శర్మ అని అన్నారు. ఈ మాట చెప్పడానికి అనుమానం అక్కర్లేదని వ్యాఖ్యానించారు.

సెహ్వాగ్ లాగే దూకుడుతో రోహిత్ కూడా ఆడాలని తాను ఆకాంక్షిస్తున్నానని వెల్లడించారు. రోహిత్‌ ఓపెనర్‌గా ఉండటం జట్టుకు లాభిస్తుంది. కమాన్! అతడికి బ్రేక్ ఇవ్వండి. అద్భుతంగా ఆడుతున్నాడు. బ్యాటింగ్ టాపార్డర్‌లో ఎంజాయ్ చేయనివ్వండి. రోహిత్ నుంచి మరిన్ని గొప్ప ఇన్నింగ్స్‌లు ఆశిస్తున్నాం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎలాంటి ఆటనైతే అతడిలో చూశామో టెస్టుల్లోనూ అదే ఆటను కొనసాగించాలని కోరుకుంటున్నామని కోహ్లీ అన్నాడు. రోహిత్‌ టెస్టుల్లో ఓపెనర్‌గా ఎలా ఆడతాడనే దానిపైనే అందరూ ఎక్కువ ఫోకస్‌ పెట్టారని, దీంతో రోహిత్ శర్మ ఒత్తిడి గురయ్యే అవకాశం ఉందని అన్నాడు.

Related posts