telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

సోనూసూద్ అభ్యర్థనను తిరస్కరించిన న్యాయస్థానం…

Sonu-Sood

కరోనా సమయంలో వలసకార్మికులకు కొండంత అండగా నిలబడి వారిని ఆదుకున్నారు. లాక్ డౌన్ మొదలైన నాటినుండి ఆయన ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను సొంత గ్రామాలకు తరలించడానికి ప్రత్యేక బస్సులు, రైళ్లను ఏర్పాటు చేసాడు. ఇక ఇప్పుడు ఏకంగా కేరళలో చిక్కుకున్న ఒడిస్సా అమ్మాయిలను సొంత గ్రామాలకు చేర్చడానికి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసాడు.విదేశాల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి రప్పించారు. అంతే కాకుండా కష్టాలు చెప్పుకున్న ప్రతి ఒక్కరికి లేదనకుండా సాయం చేసాడు . రీల్ లో చేసేది విలన్ పాత్రలే అయినా రియల్ లైఫ్ లో మాత్రం సూపర్ హీరో అనిపించుకున్నాడు. దేశమంతా సోనూసూద్ ను ప్రశంశలతో ముంచేస్తుంది. అయితే సోనూసూద్ కు ముంబై హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తనపై వేసిన కేసును కొట్టేయాలని సోనూ కోర్టును ఆశ్రయించగా.. ఆయన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ముంబైలోని జుహూలో ఉన్న ఆరంతస్తుల భవనాన్ని ఎలాంటి అనుమతులూ లేకుండానే హోటల్‌గా మార్చారంటూ బీఎంసీ గత ఏడాది అక్టోబరులో సోనూసూద్‌కు నోటీసులు పంపింది. ఈ విషయంపై సోనూసూద్​ ఇప్పటికే జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే కోర్టు పిటిషన్​ను తిరస్కరించింది. తాజాగా హైకోర్టు కూడా ఇదే తీర్పును వెల్లడించింది.

Related posts