telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

వ్యాక్సిన్ తీసుకున్న ఎయిమ్స్ డైరెక్టర్, సీరమ్ సీఈవో..

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌కి విరుగుడుగా వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధాని మోడీ 10:30 కి వర్చువల్‌ విధానంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 3006 ప్రదేశాల్లో ఒకేసారి వ్యాక్సిన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు ఒక్కో కేంద్రంలో 100 మందికి టీకాలు ఇస్తున్నారు. అయితే… వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించగానే పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్భందితో పాటు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా, సీరమ్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా కూడా టీకాలు వేయించుకున్నారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ గులేరియా ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలోనే కరోనా టీకా తీసుకున్నారు. సీరమ్‌ సీఈవో పూనావాలా తన సంస్థలోనే టీకా తీసుకున్నారు. కాగా.. కొవిషీల్డ్‌ టీకాను సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లోనే ఉత్పత్తి చేశారు.

Related posts