telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

తెలంగాణ పోలీస్ శాఖలో కొన్ని పోస్టుల రద్దు!

police acadamy hyd

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసు బెటాలియన్లలో రెగ్యులర్ పోస్టుల్లో కొన్నింటిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని విభాగాల్లోని పోస్టుల పై భారీగా కోత ఇధించింది.

బార్బర్, కుక్, ధోబీ, నర్సింగ్, మిడ్‌వైవ్, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియో థెరపిస్ట్, స్కావెంజర్, స్వీపర్ వంటి విభాగాల్లోని మొత్తం 272 పోస్టులను ప్రభుత్వం రద్దు చేసింది. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులతో ఆ ఖాళీలను భర్తీ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఆర్థిశాఖ ప్రత్యేక కార్యదర్శి డి.రొనాల్డ్‌రాస్ ఉత్తర్వులు జారీ చేశారు.

Related posts