telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

చిరిగిపోయిన నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన..

చిరిగిపోయిన, పాడైపోయిన నోట్లతో మీరు బాధపడుతున్నారా ? ఆ నోట్లు చెల్లడం లేదని ఆందోళన చెందుతున్నారా ? అయితే.. దీనిపై ఆర్బీఐ ఓ కీలక ప్రకటన చేసింది. పాడైపోయిన, చిరిగిపోయిన నోట్లను మీ సమీపంలోని ఏ బ్యాంక్‌కైనా వెళ్లి సులువుగానే మార్చుకోవచ్చని, బదులుగా కొత్త నోట్లను తెచ్చుకోవచ్చని ఆర్బీఐ చెప్తున్నది. పాడైపోయిన నోట్లను ప్రతి బ్యాంక్‌ తప్పనిసరిగా తీసుకోవాలని, ఆ నోట్లను తెచ్చినవారు తమ ఖాతాదారులా ? కాదా? అన్నది చూడవద్దని స్పష్టం చేసింది ఆర్బీఐ. వారి వద్ద నోట్ల మార్పిడికి ఎలాంటి చార్జీలు కూడా వసూలు చేయరాదని ఆర్బీఐ పేర్కొంది. ఏపీలోని కృష్టా జిల్లాలో ఇటీవల రూ. 5 లక్షల విలువైన నోట్లు చెదలు పట్టిన ఘటన వెలుగు చూసిన నేపథ్యంలో ఆర్బీఐ ఆదేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తీవ్రంగా దెబ్బతిని చెల్లుబాటు కాని స్థితిలో ఉన్న కరెన్సీని కూడా ప్రత్యేక ప్రక్రియ ద్వారా మార్చుకోవచ్చని ఆర్బీఐ వెల్లడించింది. అయితే.. సదరు నోట్లపై నెంబర్‌ మాత్రం తప్పక కనిపించాల్సి ఉంటుంది.

Related posts