telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రేమలో పడ్డ శృతి హాసన్‌ !

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కు దూసుకెళ్లింది శృతి హాసన్. ఆ తరువాత రెండేళ్లు ప్రేమ కారణంగా సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇటీవలే ఆమె లవ్ బ్రేకప్ కావడంతో మళ్ళీ సినిమాలపై దృష్టి సారించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు త‌మిళం, హిందీలో ఒక్కో సినిమా చేస్తున్నారు. అలాగే తెలుగులో తాజాగా ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబోలో వచ్చిన క్రాక్‌ చిత్రంలో కూడా హీరోయిన్‌గా శ్రుతి నటించింది. ఈ సినిమా బంపర్‌ హిట్‌ కావడంతో సలార్‌ లో కూడా ఛాన్స్‌ కొట్టేసింది. ప్రస్తుతం అమ్మడి కిట్టీలో పలు సినిమాలు ఉన్నాయి. అయితే అమ్మడు మళ్లీ ప్రేమలో పడిందనే వార్తలు వస్తున్నాయి. అతడెవరో కాదు శ్రుతి చిరకాల మిత్రుడు శంతను హాజిరికా. ఇతగాడు ఓ గొప్ప ఆర్టిస్టు. ఆర్ట్ బ్యాక్ డ్రాప్ వృత్తిగా స్వీకరించాడు. శ్రుతిహాసన్ కూడా చక్కటి ఆర్టిస్టు కావడంతో అతగాడి ఆర్ట్ కి పడిపోయింది. స్నేహం చేసింది. ఈ స్నేహాన్ని ప్రేమ అంటూ బాలీవుడ్ మీడియా ఊదరగొడుతోంది. దీనికి శ్రుతి కానీ, శంతను కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. సెల్ఫీలు దిగుతూ ఫోటోషూట్లతో కాలక్షేపం చేస్తున్నారు. అయితే దీనిపై స్పందించకుంటే తేడాలొచ్చే అవకాశముంది. మరి వీరిలో ఎవరు ముందుగా స్పందిస్తారో చూడాలి.

Related posts